AP: కాకినాడ ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మొంథా తుఫాన్ ప్రభావంతో పోర్టులో 10 నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్-9, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, ఓడరేవుకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ మొంథా ఉగ్రరూపం చూపిస్తోంది.