ప్రకాశం: పామూరు మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్పెషల్ ఆఫీసర్ తేజ సూచించారు. మంగళవారం మండలంలోని గోడ వాడ, కంబాలదిన్నె తదితర గ్రామాల్లో పర్యటించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలన్నారు. అక్కడ అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.