GNTR: మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం ఎమ్మెల్యే మాధవి సూచించారు. ముంపు ప్రాంతాల బాధితులను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని, అక్కడ వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు, నాయకులకు ఆమె ఆదేశించారు. ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉన్న వసతులను ఉపయోగించుకుని, సురక్షితంగా ఉండాలన్నారు.