GDWL: రాజోలి మండలంలోని సుంకేసుల జలాశయానికి వరద కొనసాగుతోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు, వాగులు, వంకల ద్వారా వచ్చిన నీటితో జలాశయం నిండుకుండలా మారింది. మంగళవారం సాయంత్రం జలాశయానికి 56,500 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో బ్యారేజీ 13 గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు వెల్లడించారు.