KMM: సత్తుపల్లి మండలం ఆడిచర్లపాడులో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న 250 మందికి పరీక్షలు నిర్వహించగా, 50 మందికి కంటి ఆపరేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. అనంతరం కంటి సమస్యతో బాధపడుతున్న వారికి, ప్రత్యేకంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ కాప మురళీకృష్ణ, శ్యాంబాబు, రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.