BHNG: రాజపేట మండలంలో ఐకేపీ ద్వారా నిర్వహించబడే మిగిలిన ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రారంభించాలని జేసీ వీరారెడ్డి తెలిపారు. మంగళవారం రాజపేట మండలం రఘునాథపురం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న కుప్పలను ఆయన పరిశీలించారు. బుధవారం రోజు రఘునాథపురం కేంద్రం ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. అనంతరం MRO కార్యాలయంలోని BLO ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.