E.G: దుద్దుకూరు గ్రామంలో తుఫాను ప్రభావం వల్ల కరెంటు లైన్స్‌కి ఇబ్బందిగా ఉన్న పలు చెట్లను మంగళవారం తొలగించారు. గ్రామ పంచాయితీ సిబ్బంది సెక్రటరీ, లైన్మెన్, VROలతో ఈ తుఫాను ఎదుర్కోవటానికి గ్రామంలో సందర్శించి గ్రామ పంచాయితీలో అన్ని శాఖల సిబ్బందితో చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సొసైటీ ఛైర్మన్ కరుటూరి శ్రీరామమూర్తి, ముళ్ళపూడి దొరజీ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.