CTR: కాణిపాక దేవస్థానం అభివృద్ధి కోసం తిరుమల (TTD) ధర్మకర్తల మండలి రూ.25 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో దేవస్థానంలో ఒక అతిథి గృహం, రెండు కళ్యాణ మండపాలు నిర్మించనున్నారు. ఈ నిర్ణయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.