BDK: ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాల పాల్వంచలో రెడ్ క్రాస్, లైన్స్ క్లబ్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరమును ఏర్పాటు చేయడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. పద్మ మాట్లాడుతూ.. రక్తదానం మానవతా విలువలను ప్రతిబింబించే అత్యున్నత సేవ అని, యువత ఈ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.