SKLM: వజ్రపుకొత్తూరు మండలంలో మంచినీళ్ల పేట, హుకుంపేట పునరావాస కేంద్రాలను పలాస ఆర్డీవో జి.వెంకటేష్ మంగళవారం సందర్శించారు. సముద్ర తీరానికి సమీపంలోని గ్రామాల ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆయన తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు.