ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుక్మా జిల్లాలోని పుల్బాగ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ బలగాలు గస్తీ నిర్వహిస్తుండగా ఐఈడీని గుర్తించాయి. 40 కేజీల ఐఈడీ మందుపాతరను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. దీంతో భారీ ప్రమాదం తప్పింది.