TG: జూబ్లీహిల్స్‌లో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఈరోజు సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్‌లోని 51 ప్రాంతాల్లో బీజేపీ మహా పాదయాత్రలను నిర్వహించనుంది. ఈ యాత్రల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీ.కె. అరుణ, ఎంపీ ఈటల రాజేందర్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.