సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీని శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లాలోని శాంతి భద్రతల నిర్వహణ, ఇతర అంశాలపై చర్చించారు. తనకు 1+1 గన్ మెన్ భద్రత కల్పించాలంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.