తుఫాన్లు వచ్చినప్పుడు పేర్లు పెట్టే విషయం తెలిసిందే. తాజాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కు మొంథా అని పేరు పెట్టారు. మొంథా అంటే అందమైన, పరిమళభరితమైన పుష్పం అని అర్థం. మొంథా అనే పదం థాయిల్యాండ్‌కు చెందినది. హిందూ మహాసముద్రంలోని బంగాళాఖాతం, అరేబియాలో ఏర్పడే తుఫాన్లకు పలు దేశాలు సూచించిన పేర్లను పెడుతారు. 2020లో తయారు చేసిన లిస్టు ఆధారంగా ఈ పేరును ఫిక్స్ చేశారు.