KMM: కూసుమంచి మండలం నర్సింహులగూడెం యూపీఎస్ పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఉపాధ్యాయుడిని ఇటీవల డీఈవో సస్పెండ్ చేశారు. అయితే పూర్తిస్థాయిలో విచారణ కోసం జెడ్పీ డిప్యూటీ సీఈవో నాగపద్మజను నియమిస్తూ డీఈవో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి వచ్చేనెల 7లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు.