MNCL: తాండూరులో అరుదైన తెల్లని కాకి హౌస్ క్రో (దేశీయ కాకి) కనిపించింది. ఇప్పటివరకు తెలంగాణలో కొన్ని భాగాలు మాత్రమే తెల్లగా ఉన్న కాకులు కనిపించగా.. పూర్తిగా తెల్లగా ఉన్న కాకి మొదటిసారి కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కాకి ల్యూసిజం అనే అరుదైన జన్యు పరిస్థితిని కలిగి ఉండడంతో రెక్కలు పూర్తిగా తెల్లగా మారినా కళ్ల రంగు సహజంగా ఉంటుంది.