E.G: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికార యంత్రాంగానికి మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఎర్ర కాలువ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. క్రమం తప్పకుండా ఎర్ర కాలువ పరివాహక గ్రామాల రైతులకు, ప్రజలకు తాజా పరిస్థితిని వివరించాలన్నారు.