కొన్ని చిట్కాలతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. తగినంత నిద్రపోవాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. భోజనాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. తినేటప్పుడు ఫోన్, టీవీ చూడటం వంటివి చేయకూడదు.