KMM: ‘మొంథా’ తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ప్రజలు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. వరదలు, ప్రమాదాల సమయంలో వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1077 లేదా 90632 11298కు కాల్ చేయవచ్చని తెలిపారు.