KDP: వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ద్వారా ప్రజలు వైద్యసేవలు పొందాలని డిప్యూటీ DMHO మల్లేశ్ అన్నారు. ఈ మేరకు బుధవారం దువ్వూరు మండలం కానగూడురులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కాగా, రోగులకు అందుకున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సురేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.