PDPL: పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై అధికారులతో కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. నవంబర్ 1నుంచి 7 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధం విధించాలని కోరారు. చెత్తసేకరణ, నీటినిల్వ నివారణ, పన్ను వసూళ్లు, తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.