NRML: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం నుండి సోయా కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీమ్ రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. రైతులు తమ పంటలను దళారులకు అమ్మకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలలో అమ్మాలని ఈ సందర్భంగా ఛైర్మన్ సూచించారు.