KNR: చొప్పదండి మండల రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. కపాస్ కిసాన్ యాప్, సీసీఐలో పత్తి విక్రయ నిబంధనలు, వర్షాకాలంలో మొక్కజొన్న కొనుగోలుపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏవో వంశీకృష్ణ, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.