SRD: కల్హేర్లోని ట్రైబల్ మినీ గురుకులంను MEO నాగారం శ్రీనివాస్ సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణను పరిశీలించారు. ఇందులో పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, వాష్ రూమ్స్, బడి తోట, త్రాగు నీరు, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, ఇంకుడు గుంత, సోలార్, హరితహారం ఏర్పాటు వంటి అనేక అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.