RR: మన్సురాబాద్లోని పెద్ద చెరువు కొలనులో ఛట్ పూజ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కొలను ప్రాంగణమంతా దీప కాంతులతో, పవిత్రమైన 108 నదుల నీటితో, సూర్యోదయాన్ని ఎదురు చూస్తూ భక్తుల హృదయాలు భక్తి తరంగాలతో నిండిపోయాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పాల్గొని పూజలు చేశారు.