JN: చిల్పూర్ మండలంలోని శ్రీ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా భక్తి పరవశంగా విశ్వక్సేన ఆరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో స్వామివారికి అష్టోత్తర శత సువర్ణ పుష్పాదులతో, అష్టదళ పాద పద్మారాధన సేవను ఆలయ పురోహితులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నిండా “గోవింద.. గోవింద” నినాదాలు మార్మోగాయి.