ELR: జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మోంథా తుఫాను భారీ వర్షాల దృష్ట్యా డిజాస్టర్ సెలవుదినంగా ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ ప్రైవేటు పాఠశాల కూడా అదనపు తరగతుల పేరుతో ఎటువంటి తరగతులు నిర్వహించరాదన్నారు. ఆదేశాలను పాటించనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.