కోనసీమ: తుఫాను నేపథ్యంలో రామచంద్రపురం RDO డీ.అఖిల ప్రజలకు కీలక సూచనలు చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తాని చెప్పారు. ప్రజలు ఇళ్లలో కొవ్వొత్తులు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అన్నీ మండలాల్లో 142 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.