MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లో వెలసిన కురుమూర్తి స్వామివారి ఉద్దాల (పాదుకలు) ఊరేగింపు ఈరోజు చిన్న వడ్డేమాన్ గ్రామం నుంచి ప్రారంభం కానుంది. ఉద్దాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ ప్రాంగణానికి తీసుకొస్తారు. గోవిందా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగనుంది. సాయంత్రం పాదుకలను కొండపైన ఉద్దాల మండపంలో ఉంచుతారు.