KDP: ఎర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి 2 లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎర్రగుంట్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.పెద్ద క్రేన్ సహాయంతో ఢీకొన్న లారీలను పక్కకు తప్పించి, రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.