RR: BRS సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. సత్యనారాయణ పార్థీవదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.