AP: విశాఖలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా ఉంది. గాజువాకలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. యారాడ కొండపై నుంచి బండరాళ్లు కిందపడుతున్నాయి. దీంతో యారాడ-మల్కాపురం మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ తుఫాన్ దాటికి గాజువాక బీసీ రోడ్డులో భారీ వృక్షం నేలకొరగడంతో.. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గాజువాక హౌసింగ్ బోర్డు, రిక్షా కాలనీల్లోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.