సిరిసిల్ల: తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో ఉద్యోగం పొందడానికి ST యువతీ యువకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల ఎస్టీ యువతి, యువకులు https://deet.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.