భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జమ్మూకశ్మీర్ సరిహద్దులోని లీపా వ్యాలీ వద్ద పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతోంది. దీంతో భారత సైన్యం కూడా పాకిస్తాన్కు దీటుగా బదులిస్తోంది. ఈ పరిణామం నేపథ్యంలో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.