PLD: తుఫాన్ ప్రభావంతో నరసరావుపేట మండలంలోని రావిపాడు గ్రామంలో భారీ చింతచెట్టు కూలింది. సెయింట్ మేరీస్ స్కూల్ సమీపంలో నరసరావుపేట– నకరికల్లు బైపాస్ రోడ్డుపక్కన ఉన్న చెట్టు గాలుల తీవ్రతకు నేలకొరిగింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.