దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమైంది. ఎయిర్‌పోర్టులోని మూడో టెర్మినల్ వద్ద ప్రమాదం జరిగింది. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివేశారు.