ప్రకాశం: మార్కాపురంలో చెడు అలవాట్లకు, బెట్టింగ్ జూదానికి బానిసై ఓ యువకుడు దొంగగా మారాడు. పట్టణంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన యువకుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. విచారణలో రూ. 30 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను దొంగిలించినట్లు గుర్తించామని డీఎస్పీ నాగరాజు మీడియాకు తెలిపారు.