TG: మాజీమంత్రి హరీశ్ రావు కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీ మాజీ సీఎం జగన్ హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు.