KNR: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. వృద్ధాప్య సమస్యలతో సత్య నారాయణ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ఒక ప్రకటన విడుదల చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.