BPT: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కారంచేడు మండల వ్యాప్తంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మార్వో నాగరాజు పునరావాస కేంద్రాలను పరిశీలించి అల్పాహారాన్ని స్వయంగా వడ్డించారు. ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందవద్దని అన్ని గ్రామాలలో వైద్య ఆరోగ్యశాఖ పోలీస్ రెవిన్యూ సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.