ATP: ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా కొనసాగనున్నారు. నవంబర్ 10 నుంచి 2026 జనవరి వరకు ఆయనకు కేటాయించిన ట్రైనింగ్ ప్రొగ్రామ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రోహిత్ 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు.