టాలీవుడ్ యంగ్ యాక్టర్ మౌళి, శివాని నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘లిటిల్ హార్ట్స్’. చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సెప్టెంబర్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మొత్తంగా రూ.39.6 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు దీనికి రూ.18 కోట్లకుపైగా లాభాలు వచ్చాయి. ఇక దర్శకుడు సాయి మార్తాండ్ ఈ మూవీని తెరకెక్కించారు.