WGL: 2025-27 మద్యం పాలసీ కింద షాపుల కేటాయింపు డ్రాను ఉర్సుగుట్ట నాని గార్డెన్లో సోమవారం నిర్వహించిన విషయం తెలిసిందే. నర్సంపేటకు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్, భార్య సాంబలక్ష్మి లక్కీ డ్రాలో గెలిచారు. వీరికి నర్సంపేటలో షాప్ నెం. 5, 38 కేటాయించారు. దంపతులు మాట్లాడుతూ.. వేసిన రెండు షాపులకు టెండర్లు రావడం సంతోషమని వారు అన్నారు.