BPT: మొంథా తుఫాను ప్రభావిత కుటుంబాల కోసం బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంగళవారం ఉదయం పురపాలక సంఘ కమిషనర్ జి. రఘునాథ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న కమిషనర్ , వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.