HYD: హైదరాబాద్ జలమండలికి దాదాపు రూ.1300 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు నల్ల చార్జీలను పూర్తిగా వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం నల్ల చార్జీల ద్వారా రూ.147 కోట్ల రాబడి రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. బకాయిలు ఉన్న వినియోగదారులకు నోటీసులు జారీ చేయనున్నారు.