MDK: తూప్రాన్ పట్టణంలో ఆదివారం విద్యుత్ షాక్ తగిలి పెయింటర్ తీగల సతీష్ గౌడ్(40) మృతి చెందాడు. చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన తీగల సతీష్ గౌడ్ తూప్రాన్ పట్టణంలో ఓ భవనానికి పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో రూలర్ విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్కు గురైయ్యాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.