SKLM: మోంథా తుఫాన్ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు చేరుకున్నాయని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ఆయా ప్రాంతాలకు ఆ బృందాలను పంపించడం జరుగుతుందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు.