KMM: మధిర నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ.56.75 కోట్లతో 15 నూతన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 36.80 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ రహదారుల నిర్మాణం గ్రామీణ ప్రజల రవాణా సౌకర్యాన్ని, వ్యవసాయ రవాణాను సులభతరం చేయడంలో దోహదపడనున్నాయి.