AP: టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి కుమారుడి బారసాల, నామకరణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురి సమక్షంలో రామ్మోహన్ తన కుమారుడికి శివాన్ ఎర్రన్నాయుడిగా నామకరణం చేశారు. తన అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, మనోహర్‌లాల్ తదితరులు హాజరయ్యారు.