ADB: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు సోమవారం ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా పేర్కొన్నారు. 17 నుంచి 25 ఏళ్ల లోపు అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన వారికి రూ.15 వేల వేతనంతో పాటు అలవెన్సులు ఉంటాయని, అనుభవం అవసరం లేదని తెలిపారు.